దేశంలోనే రాష్ట్రం ఆదర్శం: మంత్రి సబితా

by  |
దేశంలోనే రాష్ట్రం ఆదర్శం: మంత్రి సబితా
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు విషయంలో నూతన ఒరవడితో ముందుకు పోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్బంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. ప్రజల మద్దతుతో, ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో, సమన్వయంతో నిరంతర కృషి వల్లనే రాష్ట్రంతో పాటు రంగారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొన్నారు. మొత్తం ప్రపంచంతో పాటు రాష్ట్రాన్ని, మన జిల్లాను పట్టి పీడిస్తున్న కొవిడ్- 19 మహమ్మారిని నియంత్రించడంలో మొత్తం జిల్లా పాలనా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న నిర్విరామ కృషిని మంత్రి అభినందించారు.

కొవిడ్-19 నియంత్రణకై చేపట్టిన లాక్ డౌన్ పక్రియను పకడ్బందీగా అమలు చేయడం, అన్ లాక్ ప్రక్రియనూ అంతే స్ఫూర్తితో అమలు చేయడం ద్వారా రంగా రెడ్డి జిల్లాలో కొవిడ్ -19 వ్యాప్తిని సాధ్వమైనంతగా నియంత్రించగలిగామని తెలిపారు. జిల్లాకు భారీ పెట్టుబడులతో పారిశ్రామిక రంగాలు తరలివస్తున్నాయన్నారు. దీంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయని అన్నారు.



Next Story

Most Viewed