చలి పులి.. ఏజెన్సీలో ముసుగేసిన జనజీవనం

by  |
చలి పులి.. ఏజెన్సీలో ముసుగేసిన జనజీవనం
X

దిశ, మంగపేట: ఐదు రోజులుగా చలి విపరీతంగా పెరిగి ఏజెన్సీలోని జన జీవనం ముసుగేసుకుంది. సోమవారం లంబసింగిలో వాతావరణం 4 డిగ్రీల సెల్సియస్‌‌కు పడిపోవడంతో దట్టమైన అటవీ ప్రాంతమైన మంగపేట ఏజెన్సీలో సైతం 15 నుండి 19 డిగ్రీలకు వాతావరణం పడిపోయింది. ఐదు రోజులుగా తీవ్రమైన చలిపెరగడంతో ఏజెన్సీ వాసులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఉదయం 10 గంటలైన సూర్య కాంతి రాక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. యాసంగి పొలం పనులు అక్కడక్కడా ప్రారంభమవడంతో అత్యవసర పనులున్న రైతులు, కూలీలు మాత్రమే తమ పనుల కోసం కదులుతున్నారు. సంక్రాంతి పండగ వరకు చలి తీవ్రత ఇలాగే ఉండే అవకాశాలున్నట్లు గ్రామాల్లోని వృద్ధులు జోస్యం చెబుతున్నారు. వాతావరణ నిపుణులు, వైద్యులు మాత్రం కరోనా మరో వేరియంట్ ఒమిక్రాన్ ప్రభలే అవకాశాలున్నాయని, ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావొద్దంటున్నారు.

Next Story

Most Viewed