థియేటర్స్‌కు వెళ్లే ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్..

by  |
Parking-Fee
X

దిశ, సిటీ బ్యూరో : కొవిడ్ వ్యాప్తితో మూతపడిన నగరంలోని సినిమా థియేటర్లు ఈ నెల 23 నుంచి మళ్లీ తెరుచుకోనున్నాయి. ఇప్పటి వరకు అన్ని రకాలుగా నష్టపోయిన థియేటర్ల యజమానులకు సర్కారు తీపి కబురు అందించింది. స్టాండలోన్ థియేటర్లు(సింగిల్‌గా సినిమా హాల్ మాత్రమే)తమ పార్కింగ్ ప్లేస్‌లలో వాహానాలు పార్కింగ్ చేసుకునే వాహన యజమానుల నుంచి వెహికల్ పార్కింగ్ ఫీజును వసూలు చేసుకోవచ్చునని అనుమతిస్తూ సర్కారు మంగళవారం జీవో నెంబర్ 121ను జారీ చేసింది.

కొన్ని సినిమా థియేటర్లలో సినిమా చూసేందుకు కాకుండా ఇతర పనుల మీద వచ్చిన వారు కూడా థియేటర్స్ పార్కింగ్ ప్లేస్‌లలో తమ వాహానాలను పార్కింగ్ చేస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీన్ని అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే థియేటర్‌కు చెందిన పార్కింగ్ స్థలంలో వాహానాలను పార్కింగ్ చేసే వారి నుంచి థియేటర్ యజమాన్యం పార్కింగ్ ఫీజును వసూలు చేసుకోవచ్చునని తెలిపింది.

కానీ, ఎన్ని వాహనాలను పార్కింగ్ చేసినా.. వాహనాలకు పూర్తి భద్రత కల్పిస్తూ, పార్కింగ్ స్థలాన్ని సక్రమంగా యూస్ చేసుకోవాలని కూడా సర్కారు జీవోలో పేర్కొంది. మల్టీప్లెక్స్‌లలో, కమర్షియల్ కాంప్లెక్స్‌లలోని పార్కింగ్‌లలో ఫీజులు వసూలు చేయరాదని, వాటికి ఈ ఉత్తర్వులు వర్తించవని కూడా స్పష్టం చేసింది. పార్కింగ్ ఫీజులకు సంబంధించి 2018 మార్చి 20న జారీ చేసిన జీవో నెంబర్ 63లో మార్పులు చేస్తూ తాజాగా జీవో నెంబర్ 121 ను జారీ చేస్తున్నట్లు సర్కారు స్పష్టతనిచ్చింది.

Next Story

Most Viewed