టీవీ, సెల్‌ఫోన్లను తెగ వాడేస్తున్నారు

by  |
టీవీ, సెల్‌ఫోన్లను తెగ వాడేస్తున్నారు
X

దిశ వెబ్ డెస్క్: దేశమంతా లాక్ డౌన్ నడుస్తోంది. ప్రజలంతా ఇళ్లు దాటి బయటకు రావడానికి వీలు లేదు. దాంతో టీవీలు, స్మార్ట్ ఫోన్లు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చైనాలో వైరస్ తగ్గిందా? చైనా కంటే ఇటలీలో మరణాలు ఎక్కువనా? చైనా, ఇటలీలను అమెరికా దాటేసిందా? మన దేశంలో ఎంతమందికి కరోనా పాజిటివ్ వచ్చిందా? ఈ రోజు కరోనా బారిన పడి ఎంతమంది చనిపోయారు? ఇలా… ప్రపంచం మొత్తం కరోనా చుట్టే తిరుగుతుంది. ప్రజలు కూడా కరోనా కథనాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో చానెల్లను చూసి వారి సంఖ్య పెరిగిందని బార్క్ తెలిపింది.

ఆఫీసులు లేవు.. సినిమా థియేటర్లు లేవు.. పార్క్ లు లేవు… మరి ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఈ సమయంలో ఎంటర్టైన్ మెంట్ కావాలంటే.. అందరి చూపు మొబైల్ , సెల్ ఫోనే వైపు ఉంటుంది. దాంతో వాటి వినియోగం పెరిగింది. మార్చి 14 నుంచి 20 వరకు టెలివిజన్ వీక్షకుల సంఖ్య 6 శాతం పెరిగినట్లు బార్క్ తెలిపింది. సగటు వీక్షణ 2 శాతం పెరిగింది. జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి చేసిన ప్రసంగాన్ని ఏకంగా 19.7 కోట్ల మంది టీవీల్లో చూశారు. అందరూ ఇంటికే పరిమితం కావడంతో.. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎక్కువగా టీవీ చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వార్త చానెల్ల ఇంప్రెషన్స్ ఏకంగా 57 శాతం పెరగటం గమనార్హం .

స్మార్ట్ ఫోన్ల వినియోగం ఎక్కువే:

మొబైల్ ఫోన్లను చూస్తు గడిపే సమయం సగటున 6.2 శాతం పెరిగింది. వార్తల యాప్స్ కు 8 శాతం డిమాండ్ పెరిగింది. ఒక్కో యూజర్ వార్తల యాప్స్ పై గడుపుతున్న కాలం ఏకంగా 17 శాతం పెరిగింది, చాటింగ్ 23 శాతం, సోషల్ మీడియా చూడట 25 శాతం పెరిగాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా, టిక్ టాక్ విషయాలు చెప్పనవసరం లేదు. ఒక్కో వినియోగదారుడు వాటిని చూసే సమయం గణనీయంగా పెరిగిందని బార్క్ అంచనా వేసింది

Tags : coronavirus, tv, watching, smartphone, speech, modi, barc,



Next Story

Most Viewed