రూ.1కోటి విలువైన తిమింగలం అంబర్‌గ్రిస్‌ స్మగ్లింగ్.. ఇద్దరు అరెస్ట్..

by  |
arrest-of-cinema
X

దిశ, వెబ్‌డెస్క్: ‘స్మగ్లింగ్’ ప్రస్తుతం దేశంలోని పోలీసులు ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్. వారు ఎంత కష్టపడుతున్నప్పటికీ దీనిని అరికట్టడం సాధ్యపడటంలేదు. తాజాగా మహరాష్ట్ర పోలీసులు స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వారు గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్ చేయట్లేదు. వారు స్మగ్లింగ్ చేస్తోంది తిమింగలం అంబర్‌గ్రిస్ (తిమింగలం వాంతి). ఈ ఘటన మహారాష్ట్ర థానేలో చోటుచేసుకుంది. దాదాపు 750 గ్రాముల అంబర్‌గ్రిస్‌ను వారి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.1 కోటి ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమకు గత వారం సమాచారం అందిందని, దాని ప్రకారమే నిందితులని పట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు తమ కస్టడీలోనే ఐదు రోజుల రిమాండ్‌లో ఉన్నట్లు సీనియన్ పోలీస్ అధికారి తెలిపారు.



Next Story

Most Viewed