నర్సాపూర్‌లో టీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో భారీగా చేరికలు

by  |

దిశ‌, న‌ర్సాపూర్‌: న‌ర్సాపూర్ నియెజ‌క‌వ‌ర్గంలో వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఆదివారం చిలిపిచెడు మండలం జగ్గంపేట గ్రామానికి చెందిన పలువురు టీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు 14 మంది కాంగ్రెస్‌లో చేరారు. ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యద‌ర్శి అవుల రాజిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ర్ట నాయ‌కులు సోమన్నగారి రవీందర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగాయి. చేరిన వారికి నర్సాపూర్‌లోని ఎంపీపీ క్యాంపు కార్యాలయంలో వారు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిచారు.

ఈ సందర్భంగా అవుల రాజిరెడ్డి, ఆంజనేయులు గౌడ్, సోమన్నగారి రవీందర్ రెడ్డిలు మాట్లాడుతూ… టీఆర్ఎస్ నేతలు అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన‌ట్లు తెలిపారు. త్వర‌లోనే మ‌రికొంత మంది టీఆర్ఎస్ ముఖ్యనేత‌లు త‌మ పార్టీలోకి రానున్నట్లు చెప్పారు. టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన వారిలో నవీన్, యాదగిరి, పోచయ్య, పుల్లయ్య, మోహన్, పాషా త‌దిత‌రులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ నాయ‌కులు మల్లేశం, హకీమ్, రియాజ్, శ్రీనివాస్ గుప్తా, అశోక్, ఉదయ్, రాధాకృష్ణ గౌడ్, దేవి సింగ్ తదితరులు పాల్గొన్నారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story