- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోర్డింగ్‌లకు ఇక చెల్లు చీటి!
ప్రత్యామ్నాయంగా డిజిటల్ స్క్రీన్స్
దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో ఇకపై భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపించవు. బల్దియా వీటి స్థానంలో డిజిటల్ స్క్రీన్‌ల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ మున్సిపల్ యాక్ట్‌లో ఈ మేరకు నిబంధనలు చేరుస్తున్నారు. ఇప్పుడున్న హోర్డింగ్‌లపై ఆదాయాన్ని రాబట్టడంలో బల్దియా విఫలమవడంతో పాటు, హోర్డింగులు ప్రమాదకంగానూ ఉన్నాయని అందువల్ల వీటిని పూర్తిగా తొలగించి నగరంలో ఎక్కడా హోర్డింగ్ కనిపించకుండా చేయనున్నట్టు సమాచారం. వీటిపై కోల్పోతున్న ఆదాయాన్ని తిరిగి పొందేందుకు ఆధునిక ప్రత్యామ్నాయ ప్రచార వేదికలను కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘన!
గ్రేటర్ హైదరాబాద్‌లో హోర్డింగ్‌ల ఏర్పాటులో నిబంధనల ఉల్లంఘన కొనసాగుతున్నది బహిరంగ రహస్యంగా మారిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో అనుమతిలేకుండా సుమారు 10 వేలకు పైగా హోర్డింగ్‌లు ఉన్నట్టు అంచనా. ఇందులో జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం 2,600 హోర్డింగ్‌లకు మాత్రమే అనుమతి ఉంది. వీటి నుంచి ఏడాదికి రూ. 36 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే, ఉన్న హోర్డింగులన్నీ బల్దియా అనుమతి పొంది ఉంటే వందల కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, అలా జరగడం లేదు. నిబంధనలు అతిక్రమించి హోర్డింగులు ఏర్పాటు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల కోసం సింథటిక్ పెయింటింగ్, ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి నష్టం జరుగుతోందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. గాలివానల సందర్భంలో హోర్డింగ్‌లు కూలిపోయి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో హోర్డింగ్‌లను తొలగించాలని నగర ప్రజల నుంచి డిమాండ్ పెరుగుతోంది.
డిజిటల్ స్క్రీన్‌లతో ప్రచారం
తమ వస్తువులు, ఉత్పత్తులకు ప్రచారం చేసుకునేందుకు పలు కంపెనీలు హోర్డింగ్లను ఉపయోగించుకుంటున్నాయి. వీటి కోసం ఏజెన్సీల నుంచి బల్దియాకు ఆదాయం లభిస్తోంది. ఇప్పుడు వీటిని తొలగించి వాటి స్థానంలో ఆదాయం కోసం ప్రత్యామ్నాయంగా డిజిటల్ స్క్రీన్ ప్రచార సాధానాలు (ఎల్ఈడీ డిస్‌ప్లే) అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. విదేశాల్లోని కొన్ని ప్రముఖ నగరాల్లో ఇలాంటి అడ్వర్టయిజ్‌మెంట్ మోడల్ విధానం ఇప్పటికే ఉంది. ప్రధాన రోడ్లు, జంక్షన్లలో ఏర్పాటు చేసే ఈ స్క్రీన్స్‌లో పలు కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. నగరంలోనూ ఇలాంటి డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించేందుకు కసరత్తు నడుస్తోంది. ప్రైవేటు కంపెనీల యాడ్స్‌తో పాటు పలు సమావేశాలు, మీటింగ్‌లను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. బహిరంగ సభలు, ప్రధాన పార్టీల సభలు పెద్దఎత్తున ఉండే ప్రదేశాల్లో స్టేజీ కనిపించలేదని ఇబ్బంది పడే బదులు సిటీలో ఏ మూలలో ఉన్నా మీటింగ్‌లోని ముఖ్య నాయకుల ప్రసారాన్ని నేరుగా వీక్షించే అవకాశం ఉంది. అయితే, ఆధునిక టెక్నాలజీతో నడిచే ఈ అడ్వర్టయిజ్‌మెంట్ వ్యవస్థను ఇప్పటికే ఉన్న యాడ్ ఏజెన్సీలు అందిపుచ్చుకుంటాయా అనే సందేహాలు ఉన్నాయి. ఈ విధానాన్ని కూడా అమల్లోకి తెస్తే ఏదో ఒక ప్రముఖ కంపెనీ తప్ప మిగిలిన చిన్నచిన్న ఏజెన్సీలు మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే కంపెనీల ఓనర్లతో పాటు వాటిని నమ్ముకున్న సిబ్బంది, ఉద్యోగులు రోడ్డున పడే ప్రమాదం ఉంది.
Tags: hoardings, ghmc, digital screens, ads agencies