లాక్‌డౌన్ సమయంలో అక్రమంగా ఇసుక రవాణా

by Shyam |   ( Updated:2020-04-12 05:46:34.0  )
లాక్‌డౌన్ సమయంలో అక్రమంగా ఇసుక రవాణా
X

దిశ, రంగారెడ్డి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని లాక్‌డౌన్‌ను విధించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టారు. కానీ, ఇసుక మాఫియా నిర్వహకులు మాత్రం లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ.. యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని భీమారంలో ఇసుకని ఫిల్టర్ చేసి కుప్పలుగా పోసి ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రదేశాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఇసుక దందాని ఆపకుండా ఏమి చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇసుక ఫిల్టర్ చేసి దందా కొనసాగిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవాల్సింది పోయి.. వారికే వత్తాసు పలకుతున్నారని జనం మండిపడుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా ఇసుక దందా చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

tag: lockdown, sand transport, Improper, shadnagar

Advertisement

Next Story