ఆకట్టుకున్న ‘వేర్ డిడ్ ద హార్సెస్ గో’ ఆర్ట్ షో

by  |
ఆకట్టుకున్న ‘వేర్ డిడ్ ద హార్సెస్ గో’ ఆర్ట్ షో
X

దిశ, బంజారాహిల్స్: కళాకారుడు వేసే చిత్రాల్లో ఎంతో అర్ధం ఉంటుంది. తాను ఏం చెప్పదలచుకున్నాడో గీసే చిత్రాల్లో ప్రతిబింబించేలా నిశ్శబ్దంగా చెప్పేస్తాడు. అదే చిత్రాల్లో వివిధ రకాల గుర్రాల అద్భుతమైన కళా ఖండాలు అందంగా గీసి ఒకే చోట ప్రదర్శనకు పెడితే చూడటానికి రెండు కళ్ళు చాలవు. సరిగ్గా ఇలాంటి ఆర్ట్ షో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4 లోని కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ గ్యాలరీ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ లో భారతీయ కళాకారులు గీసిన వివిధ రకాల గుర్రలా కళాకృతులను ప్రదర్శించారు.

ఈ ప్రదర్శనలు చూసి సందర్శకులు గొప్ప అనుభూతి చెందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అవిజిత్ దత్తా, దీప్తిష్ ఘోష్ దస్తీదార్, జార్జ్ మార్టిన్ పీజే, జీ.ఆర్. ఈరన్న, జతిన్ దాస్, ముజఫర్ అలీ, రవి ఠాకూర్ కలెక్షన్, రేణుకా సొంది గులాటి, సీమా కోహ్లీ, శ్యామల్ దత్తా, శివప్రసన్న భట్టాచార్య, సుబ్రతా గంగోపాధ్యాయ్, సుజిత్ ఎస్.ఎన్, సునీల్ దాస్, ఉన్నతి సింగ్, వసుంధర తివారి బ్రూటా తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed