బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇవి తింటున్నారా…

by  |
బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇవి తింటున్నారా…
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో సరిగ్గా తినడమే మర్చిపోతున్నారు. ఇక కాస్త ఆకలి అవుతే చాలు బిస్కెట్లు తినడానికి ఆసక్తి చూపుతాము. కానీ, అలా ఆకలిగా ఉన్నప్పుడు ఏముంటే అవే తినడం వలన అనారోగ్యసమస్యల బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు. అందువలన మనకు ఎక్కవగా ఆకలి వేసినప్పుడు బిస్కెట్లు, పంచదారతో చేసిన ప్రోటీన్ బార్లకు బదులు ఆపిల్ తీసుకుంటే మంచిదని, అది కూడా పీనట్ బటర్‌తో తీసుకుంటే మరింత మేలు అని నిపుణులు అంటున్నారు. యాపిల్‌తో పాటు పీనట్ బటర్ కలిపి తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.

అలా కాకుండా మనం ఏదిపడితే అది తీసుకోవడం బిస్కెట్స్, చిప్స్ లాంటివి తీసుకోవడం వలన మన ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే ఆకలిగా ఉన్న సమయంలో మంచి ఆహారం తీసుకోవడానికే ప్రయత్నించాలి. అంతే కాకుండా ఆరు బాదంపప్పులతో పాటుగా మూడు ఖర్జూరం తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుందని, న్యూట్రీషనిస్ట్‌లు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒక్కోసారి మనకి ఏమైనా స్వీట్ గా ఉండే వాటిని తినాలనిపిస్తుంది. అటువంటి సమయంలో చాక్లెట్స్‌కి బదులుగా నట్స్ తీసుకుంటూ ఉంటే మంచిదని అంటున్నారు కాబట్టి మీరు ఎక్కువగా ఇటువంటి ఆహారం తీసుకుంటే వాటికి బదులుగా ఆరోగ్యకరమైన వంటివి తీసుకుంటే మంచిది.

Next Story

Most Viewed