అక్కడ అనుమతిచ్చేది ఒకటి కట్టేది మరోటి

by  |
అక్కడ అనుమతిచ్చేది ఒకటి కట్టేది మరోటి
X

దిశ ఖమ్మం టౌన్ : నగరంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2018 యాక్ట్ ప్రకారం భవన నిర్మాణం చేపట్టాలి అంటే 200 గజాల స్థలం పైబడిన వారు ఖమ్మం కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద నుంచి అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. ఆ విధంగా తీసుకున్న నిర్మాణాలు ఖమ్మంలో మచ్చుకు మాత్రమే కనబడుతున్నాయి. 200 గజాల లోపు స్థలం వారు మున్సిపల్ యాక్ట్ ప్రకారం నిర్మాణాలు చేసుకోవచ్చు యాక్టు‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిపితే ఆ బిల్డింగ్‌లను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూల్చివేసే అధికారం కూడా ఉంటుంది.

కానీ, ఖమ్మం నడిబొడ్డులో కార్పొరేషన్ కార్యాలయం‌కు కూతవేటు దూరం‌లో ఉన్న మామిళ్ల గూడెంలో ఓ ఇంటి యజమానికి ఇవేమీ పట్టి నట్లు లేదు. గత అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారి ఇచ్చిన అనుమతులు బేఖాతర్ చేస్తూ సీల్ట్ ప్లస్ రెండిటికీ నిర్మాణము చేయాలిసి ఉండి అంతకంటే ఎక్కువే నిర్మాణం చేస్తుండటం గమనార్హం. బహిరంగ గా ఇంత పెద్ద నిర్మాణం జరిపేటప్పుడు అన్ని అనుమతులు తప్పక ఉండాలి. కానీ ఇదేంటో టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్లోరుకు రూ.లక్షల్లో సమర్పించిన్నట్లు ప్రచారం జరుగుతోంది. విశ్వనీయ సమాచారం ప్రకారం సీల్ట్‌తో సహా రెండు ప్లోర్లు కానీ, ఇక్కడ సెల్లర్, మరో రెండు ప్లోర్లు వేస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా ఖమ్మం నగరంలో జరిగే ఇలాంటి అక్రమ నిర్మాణాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story