- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరాయి మగాడి మోజులో వివాహిత.. లాడ్జికి వెళ్లి ఆ పని చేసింది.. చివరికి ( వీడియో)
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: వివాహేతర సంబంధం తల్లి కూతుర్ల ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. ఈ సంఘటనలో ఎలాంటి సంబంధం లేని మూడు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామానికి చెందిన పూజిత(30) రాఖీ పండుగ రోజున అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తో గ్రామం నుంచి వెళ్ళిపోయింది.
రెండు రోజులపాటు నిజామాబాద్, ఆర్మూర్లో ఉన్న అనంతరం పూజితను నిర్మల్ బస్టాండ్లో వదిలేసి శ్రీకాంత్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఎన్నిసార్లు శ్రీకాంత్ రెడ్డికి ఫోన్ చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన పూజిత బస్టాండ్ పక్కన గల ఓ లాడ్జిలో కూతురికి పురుగుల మందు తాగించి తనూ సేవించింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే వీరిద్దరిని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మూడు సంవత్సరాల పాప క్యూటీ మృతి చెందింది. పూజిత పరిస్థితి విషమంగా ఉంది. పూజిత రెండు రోజుల క్రితం నుంచి కనబడడం లేదని ఆమె కుటుంబ సభ్యులు సారంగాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి వద్ద కుటుంబ సభ్యులు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.