ఉదయం నాలుగింటి నుంచి మొదలు.. యథేచ్చగా మొరం దందా

by  |
Illegal excavations
X

దిశ, వ‌ర్ధన్నపేట: పచ్చనదంతో కళకళలాడాల్సిన ప్రకృతి వనరులు రోజురోజుకూ కనుమరుగవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా మొరం తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్నారు. అక్రమంగా మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మొరం అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు చూస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కొంకపాక శివారులోని SRSP కాల్వ ప్రాంతంలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా సాగుతోంది. దీని గురించి స్థానిక అధికారులకు స‌మాచారం అందినా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. దీంతో మొరం దంద‌గాళ్లు య‌థేచ్చగా త‌వ్వకాలు చేప‌డుతున్నారు. ప్రభుత్వ భూముల నుంచి కానీ, అటవీ ప్రాంతాల నుంచి కానీ, చెరువుల నుంచి మొరం తీయాలంటే తప్పనిసరిగా అధికారుల అనుమతి తీసుకోవాలి. కానీ, ఇక్కడ అవేమి ప‌ట్టించుకోవ‌డం లేదు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొరం తరలింపు చేస్తున్నారు.

Next Story

Most Viewed