ట్రయల్ బేసిస్‌లో మానవ రహిత డ్రోన్ హెలికాప్టర్

by  |
ట్రయల్ బేసిస్‌లో మానవ రహిత డ్రోన్ హెలికాప్టర్
X

దిశ, ఫీచర్స్: ప్రెస్టీజియస్ ఇన్‌స్టిట్యూట్.. ఐఐటీ కాన్పూర్ మరో వినూత్న ఆవిష్కరణ చేసింది. ‘ఎండ్యూర్ ఎయిర్’ అనే స్టార్టప్ భాగస్వామ్యంతో మానవ రహిత డ్రోన్ హెలికాప్టర్‌ను రూపొందించింది. ఐఐటీ కాన్పూర్ ఏరోనాటిక్స్ డిపార్ట్‌మెంట్ ఈ హెలికాప్టర్ తయారీకి పూనుకుంది. అయితే ఇంకా పూర్తిస్థాయిలో సక్సెస్ కాని ఈ డ్రోన్‌ను ప్రస్తుతం ట్రయల్ బేసిస్‌లో టెస్ట్ చేస్తున్నారు.

ఈ డ్రోన్ హెలికాప్టర్‌‌ను ఉపయోగించి పలు ప్రాంతాల్లో సుదీర్ఘ కాలం నిఘా పెట్టొచ్చని, కొవిడ్ లేదా ఇతర వ్యాక్సిన్ల సరఫరాకు వినియోగించొచ్చని ఏరోస్పేస్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ అభిషేక్ చెప్పారు. కేవలం 5 కిలోల బరువు మోయగల సామర్థ్యాన్ని కలిగి ఉండి, పెట్రోల్‌తో నడిచే ఈ డ్రోన్‌ను త్వరలోనే బ్యాటరీతో నడిచేలా రూపొందిస్తామని ఆయన వివరించారు. ప్రస్తుతానికి 11,500 అడుగుల ఎత్తు వరకు ట్రయల్ విజయవంతమైందని, ఇది గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(GPS)ను ఉపయోగించి నడుస్తుందని ప్రొఫెసర్ వెల్లడించారు. కాగా డ్రోన్ మోసే బరువు పెంచేందుకు, ఇంకా ఎత్తులో ప్రయాణం కొనసాగించి.. ట్రయల్ బేసిస్‌లో టెస్ట్ చేస్తామని, ఇందుకు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు అతి తక్కువ దూరం (50 కిలోమీటర్ల లోపే) ట్రయల్స్ నిర్వహించామని, ఇక నుంచి లాంగ్ రన్ ట్రయల్స్ చేయనున్నట్లు చెప్పారు.



Next Story

Most Viewed