ప్రజలను మోసం చేస్తే కేసులు పెడతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by  |
ప్రజలను మోసం చేస్తే కేసులు పెడతాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పేదలను మోసం చేసే వారి పట్ల ఏ మాత్రం సహించబోమని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శీను గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులు అప్పులు తప్పులు చేసి అనేక ఇబ్బందులకు గురయ్యే వారన్నారు. బంధువులు, మిత్రులు సైతం సహకరించడానికి ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ షాదీ ముబారక్. కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఒక లక్ష 116 రూపాయల చొప్పున అందజేస్తున్నారని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రభుత్వం చేపట్టడం జరిగిందన్నారు. ఈ పథకాల అమలులో ఎవరైనా ఈ మధ్యవర్తులు లంచాలు తీసుకున్నా, మోసాలు చేసిన సహించబోమని హెచ్చరించారు. తమకు జరిగిన మోసాల గురించి బాధితులు తమ దృష్టికి తెస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed