వాహన తనిఖీలు మరింత కఠినం : సీపీ రవీందర్

by  |
వాహన తనిఖీలు మరింత కఠినం : సీపీ రవీందర్
X

దిశ, వరంగల్: పోలీస్ చెకింగ్ పాయింట్లలో వాహన తనిఖీలు మరింత కఠినతరం చేయడంతో పాటు అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనదారులపై కేసులు నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ ఆదేశించారు.లాక్‌డౌన్ నేపథ్యంలో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిని కట్టడి చేసేందుకు వరంగల్ ట్రై సిటీ‌స్ పరిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ చెకింగ్ పాయింట్లలో భాగంగా కేయూ జంక్షన్ చెకింగ్ పాయింట్‌ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. నిబంధనలు అతిక్రమించి రోడ్ల మీదకు అనవసరంగా వచ్చిన వారిని కారణాలు అడిగి తెలుసుకున్నారు. కారణం లేకుండా వచ్చిన వాహనదారులపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, వాహనాలపై కేసులు పెట్టాలని ఆదేశించారు. సీజ్ చేసిన వాహనాలను లాక్‌డౌన్ ముగిసాక అందజేయాలన్నారు. కరోనా తాండం చేస్తున్న పరిస్థితుల్లో అనవసరంగా రోడ్డు మీదకు రావడం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వాహనదారులు చూపించే పత్రాలను నిశితంగా పరిశీలించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీల్లో హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, కేయూ ఇన్స్పెక్టర్ డేవిడ్ రాజు, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.

tags ; lockdown rules , very strict, cp ravinder, warangal



Next Story

Most Viewed