ఎన్నికలొద్దు.. ఏకగ్రీవం చేద్దామా?

by  |
ఎన్నికలొద్దు.. ఏకగ్రీవం చేద్దామా?
X

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (International cricket council)కి కొత్త చైర్మన్‌ ఎన్నికకు విధివిధానాలను రూపొందించడానికి భేటీ అయిన బోర్డు సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎన్నికల(Election) ప్రక్రియ ముందుకు సాగలేదు. గతంలో మాదిరిగా 2/3 మెజార్టీతో ఎన్నుకుందామా? లేదా సాధారణ మెజార్టీ వస్తే చాలా అనే దానిపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

సాధ్యమైనంత వరకు ఎన్నికలు లేకుండానే చైర్మన్ (Chairman) ఎన్నికను ఏకగ్రీవం(Unanimous) చేయాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఎన్నికలు నిర్వహించడం వల్ల సభ్య దేశాల మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు అందరికీ ఆమోధయోగ్యమైన వ్యక్తిని చైర్మన్ పదవికి ఏకగ్రీవం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కాగా, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav ganguli) బరిలో ఉంటారా లేదా అనే విషయం ఇంకా సందిగ్ధంగానే ఉంది. చైర్మన్ పదవికి బలమైన అభ్యర్థిగా భావిస్తున్న కోలిన్ గ్రేవ్స్‌( Colin graves)కు అందరి సభ్యుల మద్దతు లేదు. ఇక క్రికెట్ వెస్టిండీస్ మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌(Dave cameroon)కు ఇద్దరి మద్దతు మాత్రమే ఉంది. దీంతో సరైన అభ్యర్థిని వెతికి ఏకగ్రీవం చేద్దామని బోర్డు నిర్ణయం(Board decision) తీసుకున్నట్లు సమాచారం.

Next Story