ఒక్క డిజిటల్ కచేరీతో రూ. 52 కోట్లు

by  |
ఒక్క డిజిటల్ కచేరీతో రూ. 52 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐ ఫర్ ఇండియా పేరుతో బాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలు, క్రీడాకారులు, సంగీతకారులు కలిసి ఫేస్‌బుక్‌లో నిర్వహించిన డిజిటల్ కచేరీ ద్వారా మొత్తం రూ. 52 కోట్లు విరాళాలుగా వసూలు అయ్యాయి. షారుక్ ఖాన్, ఆమిర్‌ఖాన్, ప్రియాంక చోప్రా, మిక్ జగ్గర్, విల్ స్మిత్ వంటి మహామహులు పాల్గొన్న ఈ కాన్సర్ట్‌ ప్రపంచంలోనే అతిపెద్ద విరాళాల సేకరణ కాన్సర్ట్‌గా నిలిచింది. ఫండ్ రైజింగ్ ద్వారా రూ. 4.3 కోట్లు రాగా, కార్పోరేట్ ఫిలాంథ్రోపిస్ట్‌ల దగ్గరి నుంచి రూ. 47.77 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. ఈ వసూలైన విరాళాలను గివ్‌ఇండియా వారు నిర్వహిస్తున్న ఇండియా కొవిడ్ రెస్పాన్స్ ఫండ్‌కి అందించనున్నారు.

ఈ కాన్సర్టులో కేవలం పాటలు, సాహిత్యం చదవడం మాత్రమే కాకుండా వలస కార్మికుల సమస్యలు, పిల్లలపై లైంగిక వేధింపులు, గృహహింస వంటి విషయాలను ప్రముఖులు ప్రస్తావించారు. పెంపుడు జంతువులను ఇలాంటి సంక్షోభ సమయంలో జాగ్రత్తగా చూసుకోవాలని ప్రముఖులు నొక్కి చెప్పారు.

Tags: dgital concert, celebrities, covid, corona, India, I for India, Child abuse, domestic violence

Next Story

Most Viewed