చెరువులను తలపించిన రోడ్లు..!

by  |
చెరువులను తలపించిన రోడ్లు..!
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ జనజీవనం అస్థవ్యస్తమైంది. నగరంలోని కాలనీలు, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరాఫరాలో అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజుల పాటు వర్షం కురియనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఎల్బీనగర్, నాగోల్, దిల్‎సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగోలు ఆదర్శ్‎నగర్‎లో మోకాలి లోతులో వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు మొరాయించాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. వర్షపు నీటికి ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.



Next Story

Most Viewed