పాతబస్తీలో జనాలు లేరు.. వీడియో చూడండి..!

101

దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో లాక్‌డౌన్‌ రూల్స్ పాటించడం లేదని మీడియాలో కథనాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ అంజని కుమార్ పరోక్షంగా స్పందించారు. రంజాన్ రోజు‌న ఓల్డ్ సిటీలో పర్యటించిన ఆయన ఎక్కడా కూడా జనాలు గుమిగూడిలేరని ఓ వీడియోలో చూపించారు. పౌరులు చట్టాన్ని పాటిస్తున్నారని.. లాక్‌డౌన్ నిబంధనలకు తూచా తప్పకుండా పాటిస్తున్న నగరంలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. తనకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టమని.. మరి మీకు అంటూ సీపీ అంజనీ కుమార్ నెటిజన్లకు ప్రశ్న వేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..