అసెంబ్లీ ముందు పోలీస్ కమిషనర్.. రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు..!

by  |
అసెంబ్లీ ముందు పోలీస్ కమిషనర్.. రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ నివారణ, ప్రజల్లో అవగాహన కోసం హైదరాబాద్ సిటీ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ ముందు సిటీ కమిషనర్ అంజనీ కుమార్ ఆధ్వర్యంలో.. కరోనా వైరస్ ఆకారపు హెల్మెట్లు, సేఫ్‌గార్డులు, లాఠీలకు కరోనా బొమ్మలను అమర్చి ప్రత్యేకంగా అవగాహన కల్పించారు పోలీసులు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రేపటి నుంచి లాక్‌డౌన్ రిలాక్సేషన్ సమయంలో ప్రభుత్వం చేసిన మార్పులకు మద్ధతు ఇవ్వాలని కోరారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి ఉదయం 6 వరకు కఠిన లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని హెచ్చరించారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కేసులు తప్పవని.. ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలన్నారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో 6 వేల వాహనాలను సీజ్ చేశామని చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్లుగా ఉన్న పోలీసుల్లో ఇప్పటికే రెండు వేల మంది సిబ్బందికి కరోనా వైరస్ సోకగా.. వారిలో 17 మంది మరణించారని అంజనీ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed