హైదరాబాద్‌కు 17వ స్థానం.. విజయవాడకు 27వ స్థానం

by  |
హైదరాబాద్‌కు 17వ స్థానం.. విజయవాడకు 27వ స్థానం
X

దిశ వెబ్‌డెస్క్: మున్సిపల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2020 ర్యాంకింగ్స్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 10 లక్షల జనాభా పైబడిన నగరాలు, 10 లక్షల లోపు జనాభా కలిగిన నగరాలుగా వర్గీకరించారు. ఇందులో భాగంగా ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో బెంగళూరుకు తొలి స్థానం దక్కింది. 10 లక్షల జనాభా పైబడిన నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. ఇక బెంగళూరు తర్వాత పుణె, అహ్మదాబాద్, చెన్నై, సూరత్ ఉన్నాయి.

ఈజ్ ఆఫ్ లివింగ్ ర్యాంకుల్లో సిమ్లాకు తొలి స్థానం దక్కింది. సిమ్లా తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, సిల్వస్సా, కాకినాడ, సేలం ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. 19వ స్థానంలో వరంగల్, 22వ స్థానంలో కరీంనగర్, 46వ స్థానంలో తిరుపతి ఉన్నాయి. ఇక మున్సిపల్ పెర్పార్మెన్స్ ర్యాంకింగ్స్‌లో ఇండోర్‌కు తొలి స్థానం దక్కింది. తర్వాతి స్థానాల్లో సూరత్, భోపాల్, పింప్రి-చించ్వాడ్ ఉన్నాయి. ఇందులో విశాఖకు 17వ స్థానం, హైదరాబాద్‌కు 17వ స్థానం, విజయవాడకు 27వ స్థానం దక్కింది.


Next Story

Most Viewed