హుజూరాబాద్‌ ఉపఎన్నిక: ఈవీఎంలు భద్రపరిచేది ఎక్కడో తెలుసా..?

by  |
హుజూరాబాద్‌ ఉపఎన్నిక: ఈవీఎంలు భద్రపరిచేది ఎక్కడో తెలుసా..?
X

దిశ, హుజూరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి చల్ల రవీందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ రూంలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా రవీందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించిన ఈవీఎంలను హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రపరుస్తామని తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈవీఎంలను స్థానిక పోలీస్ స్టేషన్లకు పంపిస్తామన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఈవీఎంలను పోలీస్ భద్రతతో సోమవారం హుజూరాబాద్‌కు తీసుకువస్తారని తెలిపారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను హుజూరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే భద్రపరుస్తామన్నారు. అనంతరం కౌంటింగ్ కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. అన్ని పార్టీల నాయకుల సమక్షంలో ఈవీఎంలను పరిశీలిస్తామని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకన్న, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed