మందకోడిగా కౌంటింగ్ ప్రక్రియ.. తుది ఫలితం వచ్చేసరికి రాత్రయ్యే అవకాశం

by  |
Huzurabad counting
X

దిశ, కరీంనగర్ సిటీ, హుజురాబాద్ రూరల్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా జరుగుతోన్న హుజురాబాద్ ఉప ఎన్నిక లెక్కింపు ప్రక్రియ కూడా ఆలస్యంగా జరుగుతోంది. ఇప్పటి వరకు తొమ్మిదవ రౌండ్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నప్పటికీ ఐదో రౌండ్ మాత్రమే పూర్తి కావడం విశేషం. ఈవీఎంల లెక్కింపులోనూ ఆలస్యంగా సాగుతుండటం విమర్శలకు దారి తీస్తోంది. ఓట్ల లెక్కింపులో జరుగుతున్న తాత్సరం వల్ల తుది ఫలితాలు వెలువడే వరకూ రాత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. మరో వైపున ఇప్పటికే అధికారికంగా ప్రకటించాల్సిన పోస్టల్ బ్యాలెట్ల విషయంలోనూ అధికారులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed