భువనగిరి జిల్లాలో మిడతల కలకలం

by  |
భువనగిరి జిల్లాలో మిడతల కలకలం
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో మిడతల దండు కలకలం రేపుతోంది. వందల సంఖ్యలో మిడతలు ఒక్కసారిగా కనపడటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖైతాపురంలోని ఓ వ్యవసాయ బావి సమీపంలోని చెట్టుపై మిడతలు ఉండడాన్ని రైతులు గమనించారు. మహారాష్ట్ర నుంచి మిడతలు దండుగా వస్తున్నాయని అన్నదాతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పంటలు లేకపోవడంతో చెట్లపై వాలి గంటలోపే పూర్తిగా ఆకులను తినేస్తున్నాయని రైతులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలు వేయాలంటేనే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. సమాచారం అందుకున్న వ్యవసాయ అధికారులు మాత్రం ఇవి ఇక్కడి మిడతలేనని స్పష్టం చేశారు. మిడతల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, అయినా రైతులు ముందు జాగ్రత్తగా వేపనూనె పిచికారీ చేయాలని సూచించారు.



Next Story

Most Viewed