జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద

by  |
జూరాల ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద
X

దిశ, వెబ్‌డెస్క్ : మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువనున్న కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతోంది. సుంకేసుల నుంచి 3,284 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో జూరాలకు ప్రస్తుతం ఇన్ ఫ్లో 25,400, ఔట్‌ఫ్లో 340 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 కాగా, ప్రస్తుతం 8.651 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.870 గా ఉంది. 24 గంటల వ్యవధిలో జూరాలకు మూడురెట్ల వరద పెరిగింది.

Next Story

Most Viewed