నిండుకుండలా జూరాల జలాశయం

by  |
నిండుకుండలా జూరాల జలాశయం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కృష్ణమ్మ రాష్ట్రాన్ని తాకింది. ఆల్మట్టి నుంచి విడుదలైన నీరు నారాయణపూర్ మీదుగా వచ్చింది. కృష్ణా నదిపై రాష్ట్రంలోని తొలి ప్రాజెక్టు జూరాలకు వరద చేరింది. నిన్నటివరకు స్థానిక వరద వచ్చినప్పటికీ సోమవారం సాయంత్రం వరకు ఎగువ నుంచి వరద ప్రవాహం జూరాలకు వచ్చింది. ఆల్మట్టికి 56,905 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 46,130 క్యూసెక్కులు వదలుతున్నారు. ఈ ప్రాజెక్టులో 96.51 టీఎంసీల నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయానికి 43,616 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, ఔట్ ఫ్లో 27,599 క్యూసెక్కులు ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 37 టీఎంసీలు కాగా 35 టీఎంసీల నిల్వకు చేరింది. జూరాల ప్రాజెక్టుకు సోమవారం ఉదయం వరకు 6031 క్యూసెక్కులు వస్తుండగా రాత్రి వరకు 10 వేల క్యూసెక్కులు దాటినట్లు అధికారులు చెప్పుతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా సోమవారం ఉదయం వరకే 8.38 టీఎంసీల నిల్వ ఉంది. సమాంతర, బీమా, నెట్టెంపాడు కాల్వలకు 1784 క్యూసెక్కులు వదులుతున్నారు.

మరోవైపు తుంగభద్రకు కూడా వరద కొనసాగుతోంది. 17,550 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది. 100 టీఎంసీల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు 22 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు స్థానిక వరద 1309 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఇక గోదావరి బేసిన్‌లో ఎస్సారెస్పీకి వరద పెరిగింది. సోమవారం ఉదయం వరకు 6,178 క్యూసెక్కులు వస్తుండగా కాల్వల ద్వారా 1,255 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు కాగా 33.98 టీఎంసీల నిల్వకు చేరింది. ఎల్లంపల్లికి 677, కడెంకు 376 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. గోదావరి డెల్టాలో 93,087 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 96,842క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది.



Next Story