ఆస్కార్ అవార్డు విలువ ఎంత?

by  |
ఆస్కార్ అవార్డు విలువ ఎంత?
X

సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్‌ సాధించాలంటే చాలా కష్టపడాలి. కానీ దాని విలువ మాత్రం ఆ పడిన కష్టానికంటే చాలా తక్కువ. అంటే ఆ అవార్డు సంపాదించడానికి పడిన కృషితో పోలిస్తే భౌతికంగా ఆ అవార్డు బొమ్మకు ఉన్న విలువ చాలా తక్కువ. ఆదివారం రాత్రి లాస్ ఏంజెలీస్‌లో జరగబోతున్న 92వ ఆస్కార్ వేడుకకు ముందు అక్కడ బహుమతిగా ఇచ్చే బొమ్మ విలువ గురించి ఒక అవగాహన ఏర్పరుచుకుంటే మంచిది.

అధికారికంగా అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అని పిలిచే ఈ ఆస్కార్ ప్రతిమను సెడ్రిక్ గిబ్బన్స్ డిజైన్ ఆదర్శంగా తీసుకుని జార్జ్ స్టాన్లీ రూపుదిద్దారు. కాంస్యంతో తయారైన దాని మీద 24 కేరెట్ల బంగార పూతతో ఉన్న ఈ ప్రతిమ 13.5 ఇంచుల ఎత్తు, 4 కేజీల బరువు ఉంటుంది. మొదటి ఆస్కార్‌ని 1929లో అందించారు.

ప్రతిమ ఆకారం ఎలా ఉంటుంది?

యుద్ధకత్తి పట్టుకుని ఒక సైనికుడు, సినిమా రీలు మీద నిల్చుని ఉంటాడు. దాని ఐదు చువ్వలు ఉంటాయి. ఈ ఐదు చువ్వలు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలకు ప్రతీకలు.

అకాడమీ ప్రతిమ విలువ ఒక్క డాలర్ మాత్రమే

2015లో కోర్టు తీర్పు, అకాడమీ నియమాల్లో సవరణలో అనంతరం అవార్డు గ్రహీతలు ప్రతిమను అమ్మకడానికి కానీ, నాశనం చేయడానికి కానీ వీలులేదు. ఒకవేళ చేయాలనుకుంటే అకాడమీకి ఒక డాలరుకి (దాదాపు రూ. 72) అమ్మవచ్చు. కానీ ఈ ప్రతిమ చేయడానికి మాత్రం 400 డాలర్లు (దాదాపు రూ. 28,000) ఖర్చవుతుంది.

ఒకప్పుడు చాలా విలువ

ఇప్పుడు అంటే అమ్మడానికి కొనడానికి చట్టం అడ్డొస్తోంది కానీ గతంలో ఆస్కార్ ప్రతిమకు పెద్దమొత్తంలో ధర పలికేది. 1938లో ఉత్తమ నటి అవార్డు సాధించిన బెట్టె డేవిస్ నుంచి దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఆస్కార్ ప్రతిమను 578000 డాలర్లకు కొన్నాడు.



Next Story

Most Viewed