టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌ మ్యాచ్‌ కోసం హౌస్‌ఫుల్ ప్లాన్

by  |
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌ మ్యాచ్‌ కోసం హౌస్‌ఫుల్ ప్లాన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌పై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మారుమోగనుంది. పూర్తి స్థాయిలో ప్రేక్షకుల అనుమతికి బీసీసీఐ‌తో పాటు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) సైతం అనుమతి ఇచ్చింది. ఈ క్రికెట్ స్టేడియంలో మొత్తం 25 వేల సీట్లు ఉండగా.. ఇప్పటికే 70 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఇచ్చారు.

టీ20 సిరీస్‌లో గ్రూపు దశలోనే టీమిండియా ఇంటి బాట పట్టినా.. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్‌ జట్లు సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెమీస్‌ 1లో నేడు ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజీలాండ్ జట్లు షేక్ జాయేద్ స్టేడియం, అబుదాబి వేదికగా తలపడనున్నాయి. సెమీస్‌ 2లో రేపు పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు దుబాయ్‌ స్టేడియంలోనే అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక నవంబర్ 14న(ఆదివారం)ఫైనల్ మ్యాచ్‌ కోసం బీసీసీఐ సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టేడియాన్ని హౌస్‌ఫుల్ చేసేందుకు 100 శాతం ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. ఈ వార్త విన్న క్రికెట్ ప్రియులు తెగ సంబుర పడుతున్నారు.

JusticeForSanjuSamson.. బీసీసీఐపై నెటిజన్ల సంచలన ఆరోపణ

Next Story

Most Viewed