నేటి రాశిఫలాలు.. వీరు తొందరపాటు నీర్ణయాలు తీసుకుంటే కష్టమే!

by Disha Web Desk 8 |
నేటి రాశిఫలాలు.. వీరు తొందరపాటు నీర్ణయాలు తీసుకుంటే కష్టమే!
X

మేష రాశి : నేడు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తతగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. రుణబాధలు అధికం అవుతాయి. ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ రోజు బాగుంది. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృషభ రాశి : వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, ఖర్చుల్ని తగ్గించుకో వడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్ని కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తి పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మీద కాస్తంత ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.

మిథున రాశి : వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొత్త ఉద్యోగానికి సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రయాణాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు

కర్కాటక రాశి : కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరగడానికి అవకాశ ముంది. వ్యాపారాలలో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. తలపెట్టిన పనులు, వ్యవహారాలు సకా లంలో పూర్తవు తాయి.

సింహ రాశి : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటిలో వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అత్యవసర పనుల వలన ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆదాయం బాగుంటుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది.

కన్యా రాశి : చాలా కాలంగా మీరు పడుతున్న సమస్యల నుంచి బయటపడుతారు. ఆదాయం బాగుంటుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా గడుపుతారు. ఎవరైనా మిమ్ముల్ని సమస్యలన్ని పరిష్కరించాలని కోరితే వాటిని పక్కన పెట్టడం మంచిది.

తుల రాశి : వ్యక్తిగత సమస్యల విషయంలో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది.

వృశ్చిక రాశి : త్వరిత గతిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈరోజు మీకు ఎలాంటి సంఘటనలు ఎదురైనా వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు ఎవరైతే కొన్నస్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు.దీనివలన మీకు బాగా కలసివస్తుంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఎవరైతే అంకిత భావంతో కష్టపడి పని చేస్తారో వారికి నేడు తమ కార్యాలయాల్లో గుర్తింపు లభిస్తుంది. ఈరోజు అవి కొన్ని లాభాలను తీసుకొస్తాయి. స్నేహితులతో చాలా సంతోషంగా గడుపుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

మకర రాశి : ప్రతీ సమస్యకు మీ చిరునవ్వే పరిష్కారం కాగలదు. శ్రీమతితో తగిన సంభాషణలు, సహకారము బంధాన్ని బలోపేతం చేస్తాయి. చాలా విభేదాలు ఉన్నప్పటికీ ,ఈరోజు మీప్రేమజీవితం బాగుంటుంది.మీరు మీ ప్రియమైనవారిని కూడా సంతోషంగా ఉంచుతారు.

కుంభ రాశి : ఈరోజు ఈ రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మీన రాశి : ఈరోజు మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు , కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనులవలన మీయొక్క ప్రణాళికలు విఫలము చెందుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందింపజేస్తారు. ఆర్ధిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజూచివర్లో మీకు తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు.

Next Story