ఏజ్ దాటిపోతున్నా పెళ్లి కుదరడం లేదా.. కారణం ఇదేనేమో?

by Disha Web Desk 8 |
ఏజ్ దాటిపోతున్నా పెళ్లి కుదరడం లేదా.. కారణం ఇదేనేమో?
X

దిశ, ఫీచర్స్ : పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. రెండు మనుసులు మూడు ముళ్లతో ఒకటై, ఇద్దరూ ఒకరుగా కలిసి జీవిస్తారు. ఇక సరైన ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలని పెద్దవారంటారు. కానీ కొంత మందికి వయసు అయిపోతున్నా అస్సలే పెళ్లి కాదు. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్క సంబంధం కూడా సెట్ కాదు. దీంతో వారు మనోవేధనకు గురి అవుతారు. అసలు ఎందుకు పెళ్లి కావడం లేదని జాతకాలు చూపించుకోవడం చేస్తుంటారు. అయితే జాతకంలో కళత్ర దోషం ఉంటే ఎంత ప్రయత్నించినా అస్సలే పెళ్లి కాదు అంటున్నారు జ్యోతిష్యులు.దీని కోసం కొన్ని పరిహారాలు చేస్తే గుడ్​ న్యూస్​ వింటారని అంటున్నారు.

జాతకంలో 7వ ఇంటిని కళత్ర స్థానం అని అంటారు. ఇది జీవిత భాగస్వామి స్థానం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక్కడ దోషం ఉన్న వారికి వివాహం ఆలస్యమవుతుంది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండకపోవచ్చు.

కళత్ర దోషం ఉండి, పెళ్లి చూపులు ఫలించి, నిశ్చితార్థం వరకు వెళ్లినా.. చివరిలో పెళ్లి ఆగిపోయే అవకాశం కూడా ఉంటుందని పండితులు అంటున్నారు. పెళ్లికి శుభ ముహూర్తం చాలా ముఖ్యం. కళత్ర దోషం ఉంటే.. ఆ శుభ ముహూర్తాన్ని కనుక్కోవడం కూడా కష్టమవుతుందంట. అయితే ఈ దోషం ఉన్నవారు, జ్యోతిష్యులను కలిసి దోష ప్రభావాన్ని తగ్గించే మార్గాలు,పరిహారాలను పాటించడం ద్వారా దోషం పోయి, త్వరగా వివాహాం జరిగే అవకాశం ఉన్నదంట. అయితే వీటి పరిహారలను శుక్ర,ఆది వారాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని, పండితులు చెబుతున్నారు. నోట్ : ఇంటర్నెట్‌లో ఇచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.

Next Story

Most Viewed