కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి అన్నీ సమస్యలే..

by samatah |
కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి అన్నీ సమస్యలే..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. దీంతో చాలా మంది తమకు ఈ సంవత్సరం తమ జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే 2023లో రాహువు సంచారం ఉంది. దీంతో కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. అయితే ఏ రాశి వారికి రాహువు సంచారం ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది తెలుసుకుందా.

2023 అక్టోబర్ నెలలో రాహువు రాశిని మార్చుతుంది. ఇలా ఏడాదిన్నరకు ఒకసారి జరుగుతోంది. అయితే ఈ సంవత్సరంలో బృహస్పతికి సంబంధించిన మీన రాశిలో రాహువు సంచరిస్తాడు. దీంతో కొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలగనున్నాయి.

మేష రాశి : ఈ రాశి వారికి రాహువు సంచారంతో ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కష్టానికి తగిన ఫలితం రాదు. అలాగే ఆర్థిక పెరుగుదల ఉండక, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభ రాశి : ఈ రాశి వారికి రాహువు సంచారంతో అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చాలా ఎక్కువ కష్టం పడితేనే, విజయం వరిస్తుంది.

తుల రాశి: ఈ రాశి వారు రాహు సంచారం సమయంల చాలా జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామితోని విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి : ఈ రాశ వారికి రాహు సంచారంతో, ఈ సంవత్సరం కలిసి రాదని చెప్పవచ్చు. భాగస్వామి, కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశం ఉంది.

మీన రాశి : మీన రాశికి రాహువు సచారంతో చాలా సమస్యలు ఎదురుకానున్నాయి. ఖర్చులు అధికం కావడంతో కుటుంబ సభ్యులతో గొడవలు ఎదురవుతాయి.

Next Story

Most Viewed