బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశుల వారికి మంచిగా ఉండనుంది.. ఇందులో మీ రాశి కూడా ఉందా?

by Disha Web Desk 10 |
బుధాదిత్య రాజయోగం వల్ల ఈ రాశుల వారికి మంచిగా ఉండనుంది.. ఇందులో మీ రాశి కూడా ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రభావం 12 రాశుల వారిపైనే ఉంటుంది. గ్రహాలు వాటి స్థానాన్ని మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అశుభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నార. ముఖ్యంగా ఈ వారం బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. అయితే, ఈ యోగం కారణంగా ఏ ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇక్కడ చూద్దాం..

మేష రాశి

ఈ వారంలో ఏర్పడబోయే బుధాదిత్య రాజయోగం కారణంగా మేష రాశి వారికి మంచిగా ఉండనుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. లాభాలు పెరుగుతాయి. శ్రమతో పాటు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. అలాగే మితిమీరిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది.

సింహరాశి

ఈ వారం సింహ రాశి వారికి శుభంగా ఉండనుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లడమే కాకుండా దేవాలయాలను దర్శించుకునే అవకాశాలున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా నిరాశ పెరిగి ఒత్తిడికి లోనవుతారు. ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో అనేక రకాల ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి.

Next Story

Most Viewed