ప్లాంట్‌ను మూసివేసే ఆలోచనలో హోండా మోటార్స్!

by  |
ప్లాంట్‌ను మూసివేసే ఆలోచనలో హోండా మోటార్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్ ఆటో దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంట్‌ను మూసేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ఈ తయారీ ప్లాంట్‌ను 1997లో ప్రారంభించింది. అయితే, ప్లాంట్‌ను మూసేసినప్పటికీ సంస్థకు చెందిన విడిభాగాలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డీ) కేంద్రం, కార్పొరేట్ కార్యాలయాలతో సహా ఇతర కార్యకలాపాలను కొనసాగించనున్నట్టు సమాచారం. ఈ అంశంపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ ప్లాంట్ గనక మూసేస్తే దేశీయంగా అవసరమైన ఉత్పత్తిని రాజస్థాన్‌లోని ఫెసిలిటీ‌పై ఆధారపడనున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఏడాది ప్రారంభంలో వీఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది.

గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో ఏడాది లక్ష యూనిట్ల సామర్థ్యంతో సిటీ, సివిక్, సీఆర్-వీ మోడళ్లను ఉత్పత్తి చేసింది. రాజస్థాన్ ఫెసిలిటీలో ఏటా 1.8 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కంపెనీ కలిగి ఉంది. ఈ ప్లాంట్ నుంచే ఇతర దేశాలకు ఇంజన్ ఎగుమతులు కూడా నిర్వహిస్తున్నారు. హోండా కంపెనీలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 55 శాతం పెరిగి 9,990 యూనిట్లను విక్రయించింది. ప్రస్తుతం నోయిడా ప్లాంట్‌లోని ఉద్యోగులు వీఆర్‌ఎస్ తీసుకోవడం లేదంటే రాజస్థాన్ ప్లాంట్‌కు బదిలీ అవనున్నారు. కొవిడ్-19 వంటి సంక్షోభం సమయంలోనూ వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉన్న సమయంలోనూ విక్రయాలు ఆశాజకంగా ఉన్నాయని హోండా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గోయెల్ చెప్పారు.



Next Story

Most Viewed