జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.. కేటీఆర్ ప్రకటన

by  |
జర్నలిస్టులకు ఇంటి స్థలాలు.. కేటీఆర్ ప్రకటన
X

దిశ, కోరుట్ల: లాక్‌డౌన్ తరువాత జగిత్యాల జిల్లాలోని జర్నలిస్టులకు నివేశన స్థలాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రవిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సోమవారం జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు నివేశన స్థలాలు తీసుకోని జర్నలిస్టులందరి వివరాలు సేకరించి వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సూచించారు. త్వరంలో జగిత్యాల జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

Next Story