మోడల్‌పై హాలీవుడ్ యాక్టర్ అత్యాచారం..?

by  |
Bella Davis, Joel Kinnaman
X

దిశ, సినిమా: ‘ది సూసైడ్ స్క్వాడ్’ యాక్టర్ జోయెల్ కిన్నమన్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు స్వీడన్ – జమైకా మోడల్ బెల్లా డేవిస్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా డబ్బుల కోసమేనని ఆరోపించాడు కిన్నమన్. తనను తన కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేస్తూ.. పబ్లిక్‌గా తన ఇమేజ్ నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని పోస్ట్ పెట్టాడు. పెద్ద మొత్తంలో డబ్బు, నాలుగు లక్షల డాలర్ల విలువైన అపార్ట్‌మెంట్, ఫొటో షూట్, వెరిఫైడ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ డిమాండ్ చేస్తూ.. హాలీవుడ్ కనెక్షన్స్ నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా చెప్పాడు. కాగా తను మోడల్‌పై అత్యాచారానికి పాల్పడలేదని, 2018లో ఇద్దరి ఒప్పందంతోనే లైంగిక సంబంధం కొనసాగిందని పేర్కొన్నాడు.

అయితే, ఇదంతా అబద్ధమని మోడల్ బెల్లా డెవిస్ మరో పోస్ట్ పెట్టింది. కిన్నమన్‌‌పై అత్యాచార ఆరోపణలు నిజం కాకపోతే.. తన న్యాయవాదికి కిన్నమన్‌కు సంబంధించిన ఏజెంట్ డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. కానీ తన లాయర్ ఇందుకు తిరస్కరించాడంటూ, కన్వర్జేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ షేర్ చేసింది. కిన్నమన్ అండ్ గ్రూప్ తాను సైలెంట్‌గా ఉండాలనే కోరుకుంటున్నారని, అలాగే ఉంటానని.. కానీ నిజం తప్పకుండా బయటపడుతుందని తెలిపింది.

Next Story