పర్యావరణ హితం కోసం HMDA ముందడుగు.. ఎకో ఫ్రెండ్లీ గణేష్‌లు సిద్ధం..

by  |
పర్యావరణ హితం కోసం HMDA ముందడుగు.. ఎకో ఫ్రెండ్లీ గణేష్‌లు సిద్ధం..
X

దిశ, డైనమిక్ బ్యూరో : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. ఊరూరా.. నగరంలోని గల్లీల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారైన వినాయకులను ప్రతిష్టించి, నిమజ్జనం చేయడంతో చెరువుల్లో, నదుల్లో, వాగుల్లోని నీరు కలుషితమవుతోంది. గొప్పలకు పోకుండా.. మట్టి గణపతులను నెలకొల్పినా అంతే పుణ్యమొస్తుందంటూ ఎన్జీవో లు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసినా ప్రజల్లో మార్పు రావడం లేదు. అంతేకాకుండా పర్యావరణ హితమే ధ్యేయంగా వినాయక చవితికి ప్రతి ఒక్కరూ మట్టి గణేషులను ప్రతిష్టించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో దీనిని ఆచరణలోకి తీసుకొచ్చే విధంగా హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. దాదాపు 60 వేల మట్టి గణనాథులను తమ పరిధిలో ఉన్న వారికి కనీస ధరకు అందించేందుకు హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో 20వేల ప్రతిమలను పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రతిమలను 8 అంగుళాల కనిష్ఠ ఎత్తుగా చేసేందుకు నిర్ణయించారు. అందరికీ అందుబాటులో ఉండే ధరను ఫిక్స్ చేసి అందిస్తామని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed