మట్టిగణపతులకు అధిక గిరాకీ

by  |
మట్టిగణపతులకు అధిక గిరాకీ
X

దిశ, అల్వాల్: పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన పెరిగింది. గతంలో ఇండ్లలో, మండపాలలో ప్రతిఒక్కరికీ గణపతులు పంచరంగులలో దర్శనం ఇచ్చేవి అలాంటి ఇప్పుడు ట్రెండ్​ మారింది. ఎక్కడ చూసిన మట్టిగణపతులే కానవస్తున్నాయి. పర్యావరణం పట్ల అవగాహన పెరగడం ఎంతో అభినందనీయమని పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము పడిన కష్టానికి ఫలితాలు రావడం మాకు గర్వకాణంగా ఉందంటున్నారు. జీహెచ్​ఎంసీ సైతం ఉచితంగా మట్టి వినాయకులను కాలనీలు, బస్తీలలో పంపిణీ చేయడం అంటే ప్రతి ఒక్కరికి పర్యావరణ స్రృహాకల్పించడమే అంటున్నారు. రానున్నరోజులలో నగరంలో రంగురంగుల గణపతులు కనిపించవని, మొత్తంగా మట్టిగణపతులే కనిపిస్తాయని ప్రతి ఒక్కరు వాటిని అడిగి తీసుకుపొతున్నారని అల్వాల్​లోని విగ్రహాల వ్యాపారి తెలిపారు.



Next Story

Most Viewed