- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బోనాలకు హైకోర్టు స్పెషల్ పర్మిషన్
దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని సిటీ సివిల్ కోర్టు సిబ్బందికి హైకోర్టు ప్రత్యేక పర్మిషన్ ఇచ్చింది. బోనాల పండుగ సందర్భంగా సోమవారం మధ్యాహ్నానికే విధులు ముగించుకుని ఇంటికి వెళ్ళొచ్చని రిజిస్ట్రార్ జనరల్ పేర్కొన్నారు. కోర్టు ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కేవలం సిటీ సివిల్ కోర్టుకు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని అన్ని సబార్డినేట్ కోర్టులకూ ఈ అవకాశాన్ని వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు.
యథావిధిగా సోమవారం ఉదయం విధులకు హాజరయ్యే జ్యుడిషియల్ సిబ్బంది మధ్యాహ్నం 1.15 గంటల వరకే డ్యూటీ చేస్తారని, 1.30 గంటల నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నందువల్ల పనులకు ఆటంకం లేకుండా ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 2వ తేదీకి మాత్రమే ఈ అవకాశం పరిమితమవుతుందని నొక్కిచెప్పారు.