మీరు కాదు.. ఎన్నికల సంఘం చెప్పాలి : హైకోర్టు

by  |
మీరు కాదు.. ఎన్నికల సంఘం చెప్పాలి : హైకోర్టు
X

దిశ, ఏపీబ్యూరో: కొవిడ్ ​వ్యాప్తి జరుగుతున్నా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి స్థానిక సంస్థలకు ఎందుకు నిర్వహించరని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై గతేడాది వేసిన రెండు పిటిషన్లకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

వైరస్​ వ్యాప్తి వలన ఎన్నికల షెడ్యూలు ప్రకటించినా వాయిదా వేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు సమాధానం ఇవ్వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు.. రాష్ర్ట ఎన్నికల సంఘం అని ఎస్​ఈసీకి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను నవంబరు 2కు ఏపీ ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.



Next Story

Most Viewed