జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు హైకోర్టు షాక్..

by  |
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు హైకోర్టు షాక్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : చెరువులు, నాలాలు, కాల్వలు తదితర ప్రాంతాల్లో ఎఫ్‌టీఎల్ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలను తక్షణమే ఆపివేయాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని, ఎక్కడెక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయో గుర్తించి వాటిని వెంటనే నిలిపివేయాలని స్పష్టంచేసింది. చెరువులను చెరపడుతున్నారని, కబ్జాదారులెవరో తెలిసినా, నిర్మాణాలు జరుపుతున్నట్లు తెలిసినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఆగ్రహం వ్యక్తంచేసింది.

చెరువులు, నాలాలను కాపాడటంతో నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని రవి అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ ‌దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు బెంచ్ పై ఆదేశాలు జారీచేసింది. నోటిఫైడ్ చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ రవి తరఫున న్యాయవాది శరత్ హైకోర్టు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. జోక్యం చేసుకున్న న్యాయమూర్తి, ఇప్పటికే చాలా పిటిషన్లు ఈ అంశంపై దాఖలయ్యాయని, వాటన్నింటినీ కలిపి ఒకేసారి విచారిస్తామని, వేసవి సెలవుల అనంతరం జూలై 26వ తేదీకి విచారణను వాయిదా వేశారు. అయితే ఈ లోగా అక్రమ నిర్మాణాలు జరగకుండా చూడాల్సిందిగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్‌లను ఆదేశించింది.


Next Story

Most Viewed