శింబు నా స్నేహితుడు మాత్రమే : సుభిక్ష

by  |
శింబు నా స్నేహితుడు మాత్రమే : సుభిక్ష
X

శింబు..తమిళ్ స్టార్ హీరో. మామూలుగా అయితే అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండాలి. కానీ, శింబుకు హీరోయిన్ల ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. నయనతార, త్రిష, హన్సిక, ఆండ్రియా, వరలక్ష్మి శరత్ కుమార్..ఇలా లెక్కపెట్టుకుంటూ పోతే శింబు లిస్ట్‌లో చాలా మంది హీరోయిన్లే ఉన్నారు. తమిళ్ ఇండస్ట్రీ లేడీస్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్న ఈ సూపర్ స్టార్… నటి సుభిక్షతో రిలేషన్ షిప్‌లో ఉన్నాడని కోలీవుడ్ కోడై కూసింది. అయితే, ఈ వార్తలను ఖండించింది హీరోయిన్ సుభిక్ష. నాకు శింబు మంచి మిత్రుడనీ, అంతకు మించి మా మధ్య ఏమీ లేదని చెబుతోంది ఆమె. కలిసి ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరైతే ఇలాంటివి రాసేయడం సరికాదని అంటోంది. ‘అన్నకొడి’తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తర్వాత యార్ ఇవర్గళ్, కణ్ణై నంబాదే, వేట్టై నాయ్ చిత్రాల్లో నటించింది.

Next Story