పెళ్లిపై స్టార్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు.. కేవలం దానికోసం మాత్రమే పెళ్లి చేసుకున్నా

428

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే (Radhika Apte).. వివాహ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కథల విషయంలో ఎంతో వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఆ పాత్ర డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికి కూడా వెనుకాడని ఈమె ఏ విషయమైన ముక్కుసూటితనంగా, నిర్మొహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతోదన్న విషయం అందరికి తెలిసిందే. దీంతో ఈమెను ఎంతోమంది ట్రోల్స్ చేయడం, బాలీవుడ్ నుంచి బహిష్కరించమని డిమాండ్ చేయడం కూడా జరిగాయి. కానీ, ఇవేమి  పట్టించుకోని అమ్మడు మాత్రం నోటికి అదుపు లేకుండా, మీడియా ముందు ఏది అంటే అది మాట్లాడి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి బోల్డ్ బ్యూటీ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

చిత్ర పరిశ్రమలో రాధికా  ఆప్టే కి పెళ్లి అయ్యిందన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఆమె 8 ఏళ్ళ క్రితం బ్రిటన్ కు చెందిన మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను వివాహమాడింది. ప్రస్తుతం వీరిద్దరూ విడిగానే ఉంటున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో వివాహం గురించి అడగగా.. సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి దుమారాన్ని రేపింది. పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడగగా “నాకు పెళ్లి వ్యవస్థపై అస్సలు నమ్మకం లేదు. నేను వివాహ వ్యవస్థను నమ్మను.. ఇలా చెప్తే  నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అనే అనుమానం అందరికీ రావడం సహజం. నేను కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నాను’.. విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకొంటే త్వరగా వీసా వస్తుందని చెప్పడంతో అతనిని పెళ్లి చేసుకొన్నాను” అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

సినిమాల కోసం వివాహ జీవితాన్ని త్యాగం చేస్తున్నారా..? అంటే అదేం లేదు.. నాకు నచ్చిన పని చేయడానికి నేను ఏది త్యాగం చేయడానికి సిద్ధంగా లేను.. వీసా కోసం తప్ప దేనికి నేను పెళ్లి చేసుకోలేదు అని ఘాటుగా స్పందించింది. ఇక దీంతో మరోసారి అమ్మడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి పై నమ్మకంలేని వారే ఇలా ఉంటారు.. నగ్నంగా నటించడానికి సిద్దమైనప్పుడు పెళ్లితో పనేంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.