కరోనాతో ఉత్పత్తి ప్లాంట్‌లను మూసేస్తున్నట్టు ప్రకటించిన హీరో మోటోకార్ప్

by  |
కరోనాతో ఉత్పత్తి ప్లాంట్‌లను మూసేస్తున్నట్టు ప్రకటించిన హీరో మోటోకార్ప్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టూ-వీలర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశంలో పెరుగుతున్న మహమ్మారి కేసుల నేపథ్యంలో తన తయారీ ప్లాంట్‌లను తాత్కాలికంగా మూసేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ‘ప్రజల భద్రత, సంరక్షన పట్ల నిబద్ధతకు అనుగుణంగా కంపెనీ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఉత్పత్తి ప్లాంట్‌లలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని’ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ నెల 22వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు మూసివేస్తున్నామని, ఈ కాలంలో తయారీ కర్మాగారాల్లో అవసరమైన మెయింటెనెన్స్ పనులకు ఉపయోగించుకోనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ మూసివేత వల్ల కంపెనీ డిమాండ్‌ను ప్రభావితం చేయదు. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. తర్వాతి త్రైమాసికాల్లో ప్రస్తుత ఉత్పత్తి నష్టాన్ని భర్తీ చేయగలమనే నమ్మకం ఉందని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed