హీరో సైకిల్స్ ఏ కోరిందో తెలుసా?

by  |
హీరో సైకిల్స్ ఏ కోరిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైకిల్స్ సంస్థ సైకిళ్ల పై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పాటు సైక్లింగ్ చేసే వారికి అనువైన రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కంపెనీ అభ్యర్థించింది.

‘కొవిడ్-19 కారణంగా పట్టణ జనాభాలో ప్రవర్తన మారింది. సైకిళ్లను వినియోగించే వారి సంఖ్య ఇటీవల పెరిగింది’ అని హీరో సైకిల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ ఎం ముంజాల్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెక్కువగా జిమ్‌లు, ప్రజా రవాణాను నివారించేందుకు దగ్గరి దూరాల కోసం సైకిళ్లను వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు.

ఈ పరిణామాలు ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకే కాకుండా వాతావరణంలో గాలి నాణ్యతను కాపాడేందుకు కాలుష్యాన్ని తగ్గిస్తుందని పంకజ్ పేర్కొన్నారు. ‘ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తగిన విధాన చర్యలను ప్రారంభించడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించడం వల్ల సైకిళ్లు మరింత సరసమైన ధరలకే లభిస్తాయని, తద్వారా వాటి వినియోగం మరింత పెరుగుతుందని’ పంకజ్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed