ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తి చేస్తే.. 20 లక్షల జరిమానా, జైలు శిక్ష

by  |
ఉద్దేశపూర్వకంగా కరోనా వ్యాప్తి చేస్తే.. 20 లక్షల జరిమానా, జైలు శిక్ష
X

దిశ వెబ్ డెస్క్: కరోనా కట్టడిలో భాగంగానే .. సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తుంది. అంతేకాదు.. దేశమంతా లాక్ డౌన్ విధించింది. చాలా దేశాల్లో కూడా లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న.. కొందరు నిర్లక్ష్యపూరిత, స్వార్ధపూరిత వ్యక్తుల వల్ల కరోనా రోజురోజుకు విజృభిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి సోకుతూ… కేసుల సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దాంతో యూఏఈ ప్రభుత్వం దీనికి చెక్ పెడుతూ.. ఉద్దేశపూర్వకంగా కరోనా వైరస్ వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు అమలు చేస్తామని అదేశాలు జారీ చేసింది.

యూఏఈలో ఉద్దేశపూర్వకంగా కరోనావైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నించే వారికి 1,00,000 దిర్హామ్స్ అంటే.. మన కరెన్సీలో సుమారు 20 లక్షల రూపాయలు జ‌రిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించ‌బ‌డుతుందని అక్క‌డి అధికారులు తెలిపారు. అలాగే క‌రోనా వైర‌స్ సోకిన‌వాళ్లు ఆరోగ్య‌శాఖ అధికారుల‌కు స‌మాచారం ఇవ్వ‌క‌పోతే కూడా రూ. 20 ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు మూడేళ్లు క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ రెండోసారి కూడా ఇలాంటి త‌ప్పే చేస్తే శిక్ష డ‌బుల్ అవుతుంద‌ని అధికారులు వెల్ల‌డించారు. అంటువ్యాధులకు సంబంధించి 2014లో తీసుకొచ్చిన‌ ఫెడరల్ చ‌ట్టం ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షను విధిస్తోంది యూఏఈ ప్ర‌భుత్వం. ఇక యూఏఈలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 814 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఎనిమిది మంది మృతి చెందారు.

ఏపీలోనూ: మనషుల ప్రాణాలకు ముప్పు కలిగించే వ్యాధులకు సంబంధించిన వైరస్ లు, ఇన్ ఫెక్షన్లు దురుద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసే చర్యలకు పాల్పడే వారికి ప్రభుత్వం రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తామని ఏపీ పోలీస్ శాఖ కూడా ఇది వరకు ఆదేశాలు జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఏపీలో ఐపీసీ సెక్లన్స్ 188, 269, 270, 271 లు అమల్లో ఉన్నాయి.

తెలంగాణలో: మన రాష్ట్రంలోనూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అంటు వ్యాధుల నివారణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నియంత్రణ చట్టం -1897 కు అనుగుణంగా కోవిడ్‌ -19 కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విదితమే. ఈ చట్టం ప్రకారం ఎవరైనా కరోనా అనుమానిత లక్షణాలు కలిగి ఉండి ఆస్పత్రిలో చేరేందుకు కానీ, ఐసోలేషన్‌లో ఉండేందుకు కానీ నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్‌ -188 కింద కేసులు పెట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.



Next Story

Most Viewed