శ్రీశైలానికి పెరిగిన వరద ఉధృతి

by  |
శ్రీశైలానికి పెరిగిన వరద ఉధృతి
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం ఇన్ ఫ్లో 95,279 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,253 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 853.20 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 87.2476 టీఎంసీలుగా ఉంది. వరద నీటి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.



Next Story