భారీగా మద్యం పట్టివేత

54

దిశ, వెబ్‎డెస్క్:
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పోలీసు స్టేషన్ పరిధిలో భారీగా మద్యం పట్టుబడింది. మూడు చెక్‎పోస్టుల్లో రూ.6 లక్షలు విలువ చేసే వెయ్యి బాటిళ్లను పోలీసులు గుర్తించారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ.1,73,000 నగదు స్వాధీనం చేసున్నట్లు పోలీసులు వెల్లడించారు.