ఉదయాన్నే టీ తాగుతున్నారా.. అయితే టీతో వీటిని అస్సలే తీసుకోకూడదంట!

by Dishanational2 |
ఉదయాన్నే టీ తాగుతున్నారా.. అయితే టీతో వీటిని అస్సలే తీసుకోకూడదంట!
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేవగానే వారు టీ తాగడానికి ఆసక్తి చూపుతుంటారు. మరికొందరికి టీ తాగనిదే ఆరోజే గడిచినట్లుగా అనిపించదు. అంటే అంతలా టీని ఇష్టపడుతుంటారు. అయితే టీ తాగడం మంచిదే అయినా, టీతో కలిపి కొన్ని ఆహార పదార్థాలు తీసుకోకూడదంట. దీని వలన అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

టీతో పాటు సాస్ అస్సలు తీసుకోకూడదంట. కొంత మంది సాస్, సమోసో తీసుకుంటూ టీ తాగుతారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట. అలాగే,సిట్రస్ ఫ్రూట్స్ వంటి ఆమ్లత్వం ఎక్కువగా ఫుడ్స్ తీసుకోవద్దు. టీలో కాటెచిన్స్ సమస్యలకి కారణమవుతాయి. మీరు టీ తీసుకునే సమయంలో సిట్రస్ తీసుకుంటే.. అది కాటెచిన్‌ల పరిమాణాన్ని తగ్గిస్తుందంట. అంతే కాకుండా టీతో పాటు చాక్లెట్స్, కేక్, బిస్కెట్స్ లాంటి చక్కెర ఎక్కువ ఉన్నవాటిని తీసుకోకూడదంట. ఇది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుదంటున్నారు వైద్యులు.

Next Story

Most Viewed