మనకు అలసట ఎందుకు కలుగుతుంది...? ఇంతకు అలసట అంటే ఏమిటి..?

by Dishanational1 |
మనకు అలసట ఎందుకు కలుగుతుంది...? ఇంతకు అలసట అంటే ఏమిటి..?
X

దిశ, వెబ్ డెస్క్: మీరెప్పుడైనా ఆలోచించారా? మనకు అలసట ఎందుకు కలుగుతుంది.. ఇంతకు అలసట అంటే ఏమిటి అనేది. అయితే, ఎక్కువ సేపు శ్రమించినా, అదే పనిగా చదివినా మనకు అలసట కలగడానికి కారణం లాక్టిక్ ఆమ్లం. ఎక్కువగా పని చేస్తే కండరాల్లోని గ్లైకోజన్ వెలువడి లాక్టిక్ ఆమ్ల రూపంలో శరీరంలోని రక్తంలో కలుస్తుంది. ఈ ఆమ్లంతోపాటు కండరాల చైతన్యం వల్ల శరీరంలో అతిగా తయారయ్యే కార్బన్ డయాక్సైడ్, యూరిక్ ఆసిడ్ లాంటి వ్యర్థ పదార్థాలు కూడా అలసట రావటానికి కారణం అవుతాయి. ఈ విష పదార్థాలు దేహంలోని కండరాలలోనే కాకుండా శరీరమంతా ప్రవహించే రక్తంలో కలిసిపోవడంతో శరీరం, మెదడులకు అలసట వ్యాపిస్తుంది. మత్తు పదార్థాలు సేవించినా, శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించకపోయినా కూడా అలసట కలుగుతుందంటా.

Also Read: షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయా?.. అయితే నీళ్లు ఎక్కువగా తాగండి..

Next Story

Most Viewed